లిక్కర్‌కి వేలమంది, శవయాత్రలో 20 మందికేనా? | Shiv Sena leader Sanjay Raut fires on Central Govt | Sakshi
Sakshi News home page

లిక్కర్‌కి వేలమంది, శవయాత్రలో 20 మందికేనా?

Published Sat, May 9 2020 9:16 AM | Last Updated on Sat, May 9 2020 9:24 AM

Shiv Sena leader Sanjay Raut fires on Central Govt - Sakshi

ముంబై : లాక్‌డౌన్నిబంధనల సడలింపులపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవయాత్రలో అయితే కేవలం 20 మందికి అనుమతి ఇచ్చి, మద్యం షాపుల ఎదుట మాత్రం వేలమందికి అనుమతి ఇవ్వడంపై తనదైనశైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

శవయాత్రలో 20 మందిని మాత్రమే అనుమతించారు, ఎందుకంటే ఆత్మ(స్పిరిట్‌) అప్పటికే శరీరాన్ని వదిలి వెళ్లి ఉంటుంది. అదే మద్యం షాపుల ముందు మాత్రం వేలాది మందికి అనుమతిచ్చారు. ఎందుకంటే మద్యం షాపుల్లోనే స్పిరిట్‌ ఉంటుంది కాబట్టి అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement