పంజాబ్ అసెంబ్లీలో అధికార పక్షంవైపు విపక్షం చెప్పు విసిరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో అధికార పక్షంవైపు విపక్షం చెప్పు విసిరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్–బీజేపీ ప్రభుత్వంపై తాము తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలనిడిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు గత రెండు రోజులుగా అసెంబ్లీలో బైఠాయించారు.
ఈ తీర్మానాన్ని సోమవారం నాడే మూజువాణి ఓటుతో వీగిపోయినట్లు స్పీకర్ చరణ్‌జిత్‌సింగ్ అత్వాల్ ప్రకటించారు. అయినా దానిపై చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్.. సమావేశాల చివరి రోజైన బుధవారం కూడా సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగింది. ప్రతిపక్షం వైపు నుండి ఎవరో అధికార పక్షం వైపు ఒక చెప్పు విసిరారు.