shoe thrown
-
పంజాబ్ అసెంబ్లీలో చెప్పు విసిరిన విపక్షం?
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో అధికార పక్షంవైపు విపక్షం చెప్పు విసిరిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్–బీజేపీ ప్రభుత్వంపై తాము తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలనిడిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు గత రెండు రోజులుగా అసెంబ్లీలో బైఠాయించారు. ఈ తీర్మానాన్ని సోమవారం నాడే మూజువాణి ఓటుతో వీగిపోయినట్లు స్పీకర్ చరణ్‌జిత్‌సింగ్ అత్వాల్ ప్రకటించారు. అయినా దానిపై చర్చకు పట్టుబడుతున్న కాంగ్రెస్.. సమావేశాల చివరి రోజైన బుధవారం కూడా సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగింది. ప్రతిపక్షం వైపు నుండి ఎవరో అధికార పక్షం వైపు ఒక చెప్పు విసిరారు. -
మంత్రిపైకి షూ విసిరాడు..
న్యూఢిల్లీః పంజాబ్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. మినిస్టర్ బిక్రమ్ సింగ్ మజీతియా పైకి బుధవారం అసెంబ్లీలో 'షూ' విసరడం కలకలం రేపింది. తర్లోచన్ సూంధ్ అనే కాంగ్రెస్ చట్ట సభ్యుడు తమ పార్టీ నిరసనల సందర్భంలో సభలో తన షూ విప్పి మంత్రిపైకి విసరడం పంజాబ్ అసెంబ్లీలోనే కొత్త పోకడలకు దారి తీసింది. రాష్ట్రంలోని అకాలీదళ్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై చర్చకు డిమాండ్ చేస్తున్న సందర్భంలో సూంధ్.. మంత్రిపైకి 'షూ' విసరడం ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో ఉద్రిక్తంగా మారింది. వాయిస్ ఓటు ద్వారా వారి డిమాండ్ ను తిరస్కరించినట్లు ప్రకటించడంతో సుమారు 22 మంది సభ్యులు సోమవారంనుంచీ అసెంబ్లీ భవనాన్ని విడిచి వెళ్ళలేదు.