న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు నామినేషన్ సందర్భంగా వారి ప్రతి నేరాన్నీ బహిర్గతపర్చాలా లేక వారిపై నమోదైన క్రూరమైన నేరాలనే వెల్లడించాలా? అనే అంశంపై తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. బీజేపీ ఎంపీ ఛేది పాశ్వాన్ ఎన్నిక వ్యవహారంలో పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
బిహార్‌లోని సాసారామ్ (రిజర్వుడు) నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు పాశ్వాన్.. 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌పై గెలుపొందారు. ఆయన ఎన్నిక సందర్భంగా ఆయనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు దాచిపెట్టారన్న అభియోగం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఇది తీవ్రమైన సమస్య అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాజకీయ నేతలు ప్రతి నేరాన్నీ వెల్లడించాలా, లేక తీవ్రమైన నేరాలను మాత్రమేనా అన్న అంశాలను దిగువ కోర్టు ఇదివరకే వెల్లడించిన తీర్పులో ఎలా పేర్కొందో తాము పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పాశ్వాన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ పాశ్వాన్‌పై మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు.
రాజకీయ నేతలు ఏయే నేరాలు వెల్లడించాలో పరిశీలిస్తాం
Published Tue, Aug 30 2016 12:30 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement