
నడి వీధిలో బావ అంతు చూసిన మరదలు
బావా మరదల్ల సరసాలు సహజమే. అది చూసి నలుగురు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారే తప్ప ఎవ్వరూ ఏమనరు. అయితే, అది మాటల వరకే పరిమితమై ఉండాలిగానీ హద్దులు మాత్రం అస్సలు దాటకూడదు..
మీరట్: బావా మరదల్ల సరసాలు సహజమే. అది చూసి నలుగురు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారే తప్ప ఎవ్వరూ ఏమనరు. అయితే, అది మాటల వరకే పరిమితమై ఉండాలిగానీ హద్దులు మాత్రం అస్సలు దాటకూడదు.. దాటిందో ఇక జిందగీ అబాసుపాలు కాక తప్పదు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ బావ పరిస్థితి అలాగే అయింది. తనపట్ల శృతిమించి వ్యవహరించిన బావకు ఓ మరదలు సరైన బుద్ది చెప్పింది. నలుగురిలోకి ధైర్యంగా ఈడ్చుకొచ్చి చెంపలువాయించి చెడామడా తిట్టిపారేసింది.
అందరూ చూస్తుండగానే అతడి చొక్కా పట్టి ఈడ్చుకొచ్చి ఓ చోట కూర్చొబెట్టి నలుగురిలో కడిగి పారేసింది. తనకు చేసిన అవమానాన్ని, తనపై దాదాపు లైంగిక దాడికి పాల్పడ్డటూ చేసిన ప్రయత్నాన్ని ఆ మరదలు గాయాలతో సహా అందరికీ చూపించింది. సాక్ష్యాధారాలతో సహా అతడు దొరికిపోవడంతో కుక్కిన పేనులా బెంగచూపులు చూస్తూ నలుగురిలో పరువు నిలువునా పోగొట్టుకున్నాడు. పోలీసు కేసు పెట్టారా లేదా అనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.