లక్ష్యాన్ని అడ్డుకున్నారు | some peoples are stopped my gole,says Yeddyurappa | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని అడ్డుకున్నారు

Published Mon, Sep 15 2014 2:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

లక్ష్యాన్ని అడ్డుకున్నారు - Sakshi

లక్ష్యాన్ని అడ్డుకున్నారు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప

శివమొగ్గ : ‘దేశంలోనే కర్ణాటకను నంబర్‌వన్ స్థానంలో నిలపాలన్న నా లక్ష్యాన్ని కొందరు అడ్డుకున్నారు’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శివమొగ్గలోని కువెంపు రంగమందిరంలో జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంఘం సువర్ణ మహోత్సవాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు.
 
అయితే దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా కుట్రలు సాగించారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి విషయమై తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనూ దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడిందని తెలిపారు. సమావేశంలో విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి, ఎమ్మెల్యే కె.బి.ప్రసన్నకుమార్, జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మహేంద్రప్ప, ఎల్.రుద్రేగౌడ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement