Number-one position
-
నంబర్‌వన్ సిరిల్
న్యూఢిల్లీ: తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ జూనియర్ బ్యాడ్మింటన్‌లో కొత్త ఘనతను సాధించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం ప్రకటించిన తాజా జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సిరిల్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2014 జనవరిలో ఆదిత్య జోషి నంబర్‌వన్‌గా నిలిచాక... అగ్రస్థానానికి చేరిన రెండో భారతీయుడు సిరిల్. గత నవంబర్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సిరిల్ సంచలనం సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజయంతో సిరిల్‌కు 5100 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. దాంతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి అతను నంబర్‌వన్ అయ్యాడు. గత కొంత కాలంగా జూనియర్ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడు 2013లో ఆసియా అండర్-15 విజేతగా నిలిచాడు. అనంతరం అదే ఏడాది ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సొంతం చేసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ కాంస్యం, జాతీయ అండర్-17 చాంపియన్‌షిప్‌తో పాటు పలు ర్యాంకింగ్ టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. 16 ఏళ్ల సిరిల్ ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తమ కుమారుడు నంబర్‌వన్ కావడం పట్ల అతని తల్లిదండ్రులు విజయరామరాజు, సుశీల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. -
సెరెనా మరో మైలురాయి
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో మైలురాయి చేరుకుంది. డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 250 వారాలపాటు నంబర్‌వన్ స్థానంలో కొనసాగిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. స్టెఫీ గ్రాఫ్ (377 వారాలు), మార్టినా నవ్రతిలోవా (332 వారాలు), క్రిస్ ఎవర్ట్ (260 వారాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్) విజేతగా నిలిచిన సెరెనా, సెప్టెంబ రులో జరిగే యూఎస్ ఓపెన్‌లో క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ ఘనతపై గురి పెట్టింది. -
నయనే కావాలి
చిత్రాల్లో ఎలాంటి సన్నివేశాలున్నా అవి నయనానందకరంగా ఉంటేనే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి చూస్తారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఒక పక్క పాత్రల్ని పండిస్తూ మరో పక్క అందంతో యువతను ఉల్లాసపరిచే నటీమణుల్లో నయనతార ఒకరు. ఈమెది మహర్ధశ అని చెప్పక తప్పదు. కోలీవుడ్ కాకపోతే టాలీవుడ్ అది లేదంటే ఉండనే ఉంది మాతృభాష అయినా మాలీవుడ్. ఈ బ్యూటీ సొంత గడ్డపై నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అది ఎంత మంచి చిత్రంగా పేరు పొందిందంటే సూపర్‌స్టార్ రజినీకాంత్‌నే తమిళ రీమేక్‌లో నటించాలన్న ఆసక్తిని రేకెత్తించినంతగా. అయితే కొన్ని కారణాల వలన ఆ చిత్ర రీమేక్‌లో రజనీకాంత్ నటించడం లేదన్నది వేరే సంగతి. వ్యక్తిగత కారణాల వలన నటనకు దూరం అయిన సుమారు రెండేళ్ల తరువాత మళ్లీ రీ ఎంట్రీ అయి రాజారాణి చిత్రంతో మరోసారి హీరోయిన్గా విజయాన్ని అందుకున్నారు. దీంతో తమిళంలో అవకాశాలు ఆమెపై దండెత్తాయనే చెప్పాలి. ఇటీవల విడుదలైన మాస్ చిత్రం వరకు నయనతార విజయపరంపర కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం నయన నటించిన ఇదు నమ్మ ఆళు, తనీ ఒరువన్, మాయ, నానుం రౌడీదాన్ చిత్రాలు విడుదలకు వరుసకడుతున్నాయి. తాజాగా కార్తీతో కాష్మోరా చిత్రంలో నటిస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ కోలీవుడ్ నంబర్‌వన్ స్థానంలో వెలుగొందుతున్నారు. రెండు, రెండున్నర కోట్లు పారితోషికం డిమాండ్ చేసినా దర్శక, నిర్మాతలు నయనతారనే హీరోయిన్గా కోరుకోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఈ అమ్మడికి టాలీవుడ్‌లోనూ యమ క్రేజ్ ఉంది. ఆ మధ్య అనామిక చిత్ర ప్రమోషన్ విషయంలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా ఇప్పుడు అవన్నీ సమసి పోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ తమ సరసన ఈ బ్యూటీనే హీరోయిన్గా కోరుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో నటించడానికి రెడీ అవుతున్న నయనతార నటుడు చిరంజీవి 150వ చిత్రంలో కూడా హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అమ్మడికింత డిమాండ్‌కు కారణం ఏమిటన్నది ఆరా తీస్తే ముఖ్యంగా వసూళ్లే కనిపిస్తున్నాయి. నయనతార నటించిన తమిళ చిత్రాలు, తెలుగులోనూ అనువాదం అయినా గల్లాపెట్టెలు నింపుతున్నాయి. తెలుగులో నటించిన చిత్రాల అనువాదానికి కోలీవుడ్‌లో వ్యాపారం జరుగుతోంది. దీంతో ఈ కేరళ కుట్టి హవా కొనసాగుతోంది. -
లక్ష్యాన్ని అడ్డుకున్నారు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప శివమొగ్గ : ‘దేశంలోనే కర్ణాటకను నంబర్‌వన్ స్థానంలో నిలపాలన్న నా లక్ష్యాన్ని కొందరు అడ్డుకున్నారు’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శివమొగ్గలోని కువెంపు రంగమందిరంలో జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంఘం సువర్ణ మహోత్సవాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన గుర్తు చేశారు. అయితే దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా కుట్రలు సాగించారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి విషయమై తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనూ దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడిందని తెలిపారు. సమావేశంలో విధానపరిషత్ సభాపతి డి.హెచ్.శంకరమూర్తి, ఎమ్మెల్యే కె.బి.ప్రసన్నకుమార్, జిల్లా వాణిజ్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మహేంద్రప్ప, ఎల్.రుద్రేగౌడ పాల్గొన్నారు.