న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు షాహిద్ యుసుఫ్ (42)ను ఉగ్ర నిధుల కేసులో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
జమ్మూకశ్మీర్ ప్రభుత్వ వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న యుసుఫ్‌ను మంగళవారం ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నామని ఎన్‌ఏఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. బుధవారం అతనిని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. ఉగ్ర నిధుల కేసులో మరో నిందితుడైన ఐజాజ్ అహ్మద్ భట్ నుంచి అమెరికాకు చెందిన కంపెనీ ద్వారా యుసుఫ్‌కు నిధులు అందాయనేది ఎన్‌ఐఏ ప్రధాన ఆరోపణ. మొత్తం రూ. 4.5 లక్షల నిధులు అందుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment