సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల పాఠశాల విద్యార్థులు సిద్ధవుయ్యూరు. 60 నుంచి 70 రోజుల వరకు పట్టే ఈ సాహసయూత్రకు వారు వుంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం విద్యార్థుల ఎవరెస్ట్ అధిరోహణకు సంబంధించి వివరాలను ట్రైనర్ శేఖర్‌బాబు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్ణ(14), ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్‌ఇయుర్ చదువుతున్న ఆనంద్‌కుమర్(17)లు గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు.
వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ అధిరోహణకు పూనుకున్నామని ట్రైనర్ శేఖర్‌బాబు వెల్లడించారు. 29,100 అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ ఇద్దరూ అధిగమిస్తే అత్యంత పిన్న వయస్కులో ఎవరెస్ట్ ఎక్కిన బాలికగా పూర్ణ, దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్‌లు రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది.
ఎవరెస్ట్‌ను అధిరోహించనున్న రాష్ర్ట విద్యార్థులు
Published Tue, Apr 8 2014 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement