సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వేగవంతం చేసింది. బుధవారంనాటికి 10 లక్షల మంది జనాభాకు సగటున 961 మందికి పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా సగటున 334 ఉండగా, అన్ని రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
(న్యూస్ పేపర్‌ను చుట్టుకున్న హీరోయిన్! )
దేశంలో గురువారం ఉదయం నాటికి కరోనా కేసు 21,370 గా నమోదవ్వగా 681 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్యలో, మరణాల సంఖ్యలోనూ మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,710 చేరగా.. ఇప్పటివరకూ 269మంది చనిపోయారు. ఇక తెలంగాణలో బాధితుల సంఖ్య వెయ్యికి చేరువగా ఉంది.943 కేసులకు 24 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 893గా నమోదవ్వగా.. 27 మంది మరణించారు. కాగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రస్తుత కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి. (కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్ )
కరోనా: రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు
రాష్ట్రం | పాజిటివ్ కేసులు |
మరణాలు | నిర్వహించిన టెస్టులు | మిలియన్‌కి |
ఆంధ్రప్రదేశ్ | 893 | 27 | 48034 | 961 |
తెలంగాణ | 943 | 21 | 13200 | 375 |
అస్సాం |
35 |
1 |
5279 |
171 |
బీహార్ | 141 | 2 | 11973 | 121 |
చత్తీస్‌గఢ్ | 36 | 0 | 8332 | 327 |
హర్యానా | 264 | 3 | 13643 | 546 |
హిమాచల్ ప్రదేశ్ | 39 | 2 | 3350 | 488 |
గుజరాత్ | 2407 | 103 | 39421 | 646 |
జార్ఖండ్ | 46 | 2 | 5176 | 162 |
కర్ణాటక | 427 | 17 | 25851 | 404 |
కేరళ | 437 | 2 | 20435 | 601 |
మధ్య ప్రదేశ్ | 1587 | 80 | 22664 | 310 |
మహారాష్ట్ర | 6,710 | 269 | 82304 | 722 |
ఒడిశా | 83 | 1 | 18750 | 436 |
పంజాబ్ | 278 | 16 | 7357 | 363 |
రాజస్థాన్ | 1888 | 27 | 60420 | 877 |
తమిళనాడు | 1629 | 18 | 59023 | 869 |
ఉత్తరప్రదేశ్ | 1449 | 21 | 41712 | 204 |
ఉత్తరాఖండ్ | 46 | 0 | 3710 | 372 |
పశ్చిమబెంగాల్ | 423 | 21 | 7034 | 78 |
ఢిల్లీ | 2248 | 48 | 28309 | 1490 |
జమ్మూకశ్మీర్ | 407 | 5 | 10039 | 803 |
చంఢీగఢ్ | 27 | 0 | 529 | 499 |
Comments
Please login to add a commentAdd a comment