చత్తిస్గఢ్: శాంతియాత్రకు వెళ్లి మావోయిస్టుల చేతిలో కిడ్నాప్కు గురైన ముగ్గురు విద్యార్ధులు క్షేమంగా విడుదలయ్యారు. పూణే యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు సైకిల్పై శాంతియాత్ర చేపడుతుండగా చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బైరాంగడ్ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులను మావోలు విడుదల చేయడంతో చింతల్నార్ వద్ద వారు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. మావోల చెర నుండి తమ పిల్లలు విడుదలయ్యారన్న సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.