
డ్యాన్స్ బార్ల లైసెన్సులు ఆలస్యం ఎందుకు?
న్యూఢిల్లీ: ముంబయిలో డ్యాన్స్ బార్ల ఓపెనింగ్ కోసం సంబంధిత యజమానులు దాఖలు చేసిన దరఖాస్తులపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత అక్టోబర్ 15న మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లపై విధించిన నిషేధంపై సుప్రీకోర్టు స్టే ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో డ్యాన్స్ బార్ల ఓపెనింగ్ సందడి మరోసారి ప్రారంభమైనట్లయింది.
అయితే, వీటి ఓపెనింగ్ కోసం బార్ల యజమానులు దరఖాస్తులు చేసుకున్న ఇప్పటి వరకు మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014 జూన్ నెలలో ముంబయిలోని డ్యాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక సవరణను తీసుకొచ్చి ఏకగ్రీవంగా ఆమోదించి వాటిన్ బ్యాన్ చేసింది. దీనిపై గతంలో సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లగా బ్యాన్ పై స్టే విధించింది.