న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ జీవితంపై వచ్చిన ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకం అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రచురణ సంస్థ జగనాట్ పబ్లికేషన్స్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు సెప్టెంబర్‌కల్లా తుది నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.
జర్నలిస్ట్ ప్రియాంక పాఠక్ రాసిన ఈ పుస్తకంలో రాందేవ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన లాయర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను విచారించిన కోర్టు పుస్తకం అమ్మకాలపై ఏప్రిల్ 28న నిషేధం విధించింది. కానీ జగనాట్ సంస్థ మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఏఎస్‌సీజే) ఒకరు ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేశారు. దీంతో రాందేవ్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పుస్తకం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మే 10న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై జగనాట్ లాయర్లు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment