ట్వీట్టర్‌లో సుష్మా స్వరాజ్ రికార్డ్! | Sushma Swaraj most followed foreign minister on Twitter | Sakshi
Sakshi News home page

ట్వీట్టర్‌లో సుష్మా స్వరాజ్ రికార్డ్!

Published Fri, Dec 5 2014 3:57 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

సుష్మా స్వరాజ్ - Sakshi

సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీట్టర్‌లో అత్యధిక మంది అనుసరిస్తున్న విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు సృష్టించారు. ట్వీట్టర్‌లో అనుసరించేవారితో మూడో ప్రపంచస్థాయి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  సుష్మాను మొత్తం 17, 37,804 మంది అనుసరిస్తుండటంతో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు.  యూఏఈ విదేశాంగ మంత్రి జాయేద్ 13, 80,574 మందితో రెండవస్థానంలో,  వెనెజులా విదేశాంగ మంత్రి జువా మిరాండా 7,58,198 మందితో మూడవ స్థానంలో నిలిచారు.  నవంబరు చివరినాటికి ఉన్న ఫాలో అయ్యేవారి సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు ట్వీటర్ వెల్లడించింది.

కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్‌ల తర్వాతి స్థానంలో ఉన్న మోదీని ట్వీట్టర్‌లో 83.9 లక్షల మంది  ఫాలో అవుతున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement