గువహటి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అసోంలో పర్యటించారు. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయాన్ని రాహుల్ పక్కనబెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తరుణ్ గొగోయ్ని ప్రకటించారు. రెండు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ రోడ్ షోలు నిర్వహించారు. సీనియర్ జర్నిలిస్టులు, స్థానిక న్యూస్ పేపర్ల ఎడిటర్లతో సమావేశమయ్యారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే బర్పేటా జిల్లాలో పర్యటించిన రాహుల్.. అభివృద్ధి, శాంతిని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. తొమ్మిది కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
2001 నుంచి వరుసగా మూడుసార్లు పార్టీ పగ్గాలు చేపట్టి విజయాలు సాధిస్తోన్న తరుణ్ గొగోయ్ని మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా హెచ్చరికలు పంపించారు. గతేడాది అసోంకి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మీకు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కేవలం ద్వేషం, హింసను మాత్రమే బీజేపీ వ్యాపింప చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. వాటిపై రాజకీయాలు చేయడం వచ్చంటూ రాహుల్ మండిపడ్డారు.
'విద్వేషాలు రెచ్చగొట్టడమే మోదీ రాజకీయాలు'
Published Sat, Dec 12 2015 10:18 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement