యువతి సాహసం.. | Teen chases down robber, is cut with blade but holds on | Sakshi
Sakshi News home page

యువతి సాహసం..

Published Thu, Jun 2 2016 9:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

యువతి సాహసం.. - Sakshi

యువతి సాహసం..

న్యూఢిల్లీ: ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం స్థానికంగా అందరి మన్ననలు అందుకుంది. దొంగను వెంటాడి పట్టుకున్న ఢిల్లీ యువతిని అందరూ మెచ్చుకుంటున్నారు. 18 ఏళ్ల ప్రియాంక పాండవ్ నగర్ లోని తన అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఎదురింటి నుంచి 'దొంగను పట్టుకోండి' అంటూ అరుపులు వినిపించాయి. దొంగ పారిపోవడం చూసిన ప్రియాంక పులిలా ముందుకు ఉరికింది. ఛేజ్ చేసి అతడిని పట్టుకుంది.

కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆమె ముందు అతడి ఎత్తులు పారలేదు. అతడి మెడను పట్టుకోవడంతో పారిపోవడానికి వీళ్లేకపోవడంతో బ్లేడుతో ఆమెను గాయపరిచాడు. అయినా ఆమె పట్టువదల్లేదు. దొంగను స్థానికులకు అప్పగించింది. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రియాంక ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. ఆర్మీ జవాను లేదా పోలీసు కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కరాటే నేర్చుకున్నానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement