Pandav Nagar
-
రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: సర్వీస్ రివాల్వర్‌తో సబ్ ఇన్స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పాండవ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తిడితో తన భర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. చదవండి: కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
తెగబడ్డ దొంగలు, పరిగెత్తిన మహిళ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు తెగ బడుతున్నారు. పట్టపగలు నడిరోడ్డుపై చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని పాండవ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న స్నాచింగ్ తాజాగా కలకలం రేపింది. మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్‌ను దుండగులు లాక్కుపోయారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. దుండగులను ప్రతిఘటించిన బాధితురాలు వారిని పట్టుకునేందుకు కొంచెం దూరం బైక్ వెంట పరిగెత్తిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా దీనిపై స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సహాయపడగలవని ఆయన అన్నారు. దుండగులు తప్పించుకోలేరని అంటూ ఘటన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. పాండవ నగర్, పాత్‌పర్‌గంజ్ ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే బాధితురాలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఉత్తర ఢిల్లీలో స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో లక్ష్మీనగర్‌లో ఇంటి బయట వేచివున్న వృద్ధురాలిని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దోపిడీ చేశారు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డైయ్యాయి. -
యువతి సాహసం..
న్యూఢిల్లీ: ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం స్థానికంగా అందరి మన్ననలు అందుకుంది. దొంగను వెంటాడి పట్టుకున్న ఢిల్లీ యువతిని అందరూ మెచ్చుకుంటున్నారు. 18 ఏళ్ల ప్రియాంక పాండవ్ నగర్ లోని తన అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఎదురింటి నుంచి 'దొంగను పట్టుకోండి' అంటూ అరుపులు వినిపించాయి. దొంగ పారిపోవడం చూసిన ప్రియాంక పులిలా ముందుకు ఉరికింది. ఛేజ్ చేసి అతడిని పట్టుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆమె ముందు అతడి ఎత్తులు పారలేదు. అతడి మెడను పట్టుకోవడంతో పారిపోవడానికి వీళ్లేకపోవడంతో బ్లేడుతో ఆమెను గాయపరిచాడు. అయినా ఆమె పట్టువదల్లేదు. దొంగను స్థానికులకు అప్పగించింది. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రియాంక ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఆమె సాహసానికి స్థానికులు అబ్బురపడ్డారు. ఆర్మీ జవాను లేదా పోలీసు కావడమే తన లక్ష్యమని, ఇందుకోసం శ్రమిస్తున్నానని ప్రియాంక చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కరాటే నేర్చుకున్నానని తెలిపింది.