లక్నోలో ఘనంగా ఉగాది వేడుకలు
Published Mon, Apr 3 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఆదివారం తెలుగు సంఘం వేడుకలు హేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు పెద్ద సంఖ్యలో సభ్యులు, అతిథులు తదితరులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంత్రి సృతంతసింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉగాది పర్వదినంపై ప్రసగించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన నృత్యాలు, పేరిణి శివతాండవం, మహిషాసుర మర్ధిని, జానపద గీతాలు, మిమిక్రీ, లక్నో తెలుగు సంఘం కళాకారులు చేసిన కార్యక్రమాలు కనువిందు చేశాయి. తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు డీ ఎన్ రెడ్డి, అన్నంరాజు రజనీకాంత్, కేవీఎన్ రావు, మట్ట సంధ్య, విజయలక్ష్మీ, సుచిత్రలు కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు.
Advertisement
Advertisement