ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తొలిసారిగా కోటి పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు. వసంతమాస ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శంచుకోవడానికి ఇంద్రకీలాద్రికి భక్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.