telugu sangam
-
కాశీలో తెలుగు సంగమం గంగా పుష్కర్ ఆరాధన...ముఖ్య అతిధిగా మోదీ
-
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
బెంగళూరులో తెలుగు సంఘాల పంచాయితీ
-
కర్ణాటక ఎన్నికలు; టీడీపీ బిత్తిరి రాజకీయం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో హీనస్థాయి రాజకీయాలు చేయబోయిన తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. టీడీపీ ప్రోదర్బలంతో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం బెంగళూరులో తెలుగు సంఘాలతో జరిపిన సమావేశం రసాభసకు దారితీసింది. ‘‘ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా, స్థానిక సమస్యలపై నోరుమెదపకుండా.. ఇక్కడికి(కర్ణాటకకు) వచ్చి మీరు చెప్పదల్చుకున్నది ఏంటి?’ అని నిలదీతలు ఎదురయ్యాయి. అసలేం జరిగింది?: ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరుతో అశోక్ బాబు బృందం బెంగళూరులో నిర్వహించిన సమావేశానికి కర్ణాటకలోని పలు తెలుగు సంఘాలను ఆహ్వానించారు. ఏపీకి అన్యాయం చేసినందున కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాటలనే అశోక్‌బాబు వల్లెవేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ‘అదేంటిసార్, ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి గెలిపించమని కోరడం ఎంతవరకు సమంజసం?’’ అని కొన్ని సంఘాలు నిలదీశాయి. ‘ప్రత్యేక హోదా ఉద్యమంలో మారు మాట్లాడని మీరు ఇక్కడికొచ్చి చెప్పేది ఇదేనా?’’ అని ప్రశ్నించారు. తెలుగు పేరుతో టీడీపీ సమావేశమేంటి?: సమావేశం జరిగిన తీరును నిరసిస్తూ పలు తెలుగు సంఘాలు గళం విప్పాయి. ‘‘తెలుగు సంఘాల పేరుతో టీడీపీ సమావేశం నిర్వహించడమేంటి? ఒకవేళ ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే మేము ఇక్కడికి వచ్చేవాళ్లమేకాదు. అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడని ఉద్యోగ సంఘాలు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పడానికి వచ్చారు? అశోక్ బాబును చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. కానీ మమ్మల్ని బయటికి గెంటేశారు. ఆహ్వానించి ఇలా చేయడం ఎంతవరకు సబబు?’’ అని కర్ణాటకలోని తెలుగు యువకులు వాపోయారు. టీడీపీతొ పొత్తువల్లే బీజేపీ బతికింది: సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ఇజంకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతలకు చెక్ పెట్టడమంటే ఓడించడమే. అసలు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ బతికిపోయింది.’’ అని అన్నారు. ‘నాలుగేళ్లు టీడీపీ-బీజేపీ కలిసే ఉందికదా, మరి ఏపీలో కాలయాపన చేశారెందుకు?’ అన్న మీడియా ప్రశ్నకు అశోక్ బాబు పొంతనలేని సమాధానమిచ్చారు. ‘‘10 ఏళ్లు టైముందని, ఆరాటం వద్దని బీజేపీ వాళ్లే చెప్పారు. కాబట్టే ఏపీ హక్కుల విషయంలో మేం మౌనంగా ఉన్నాం. అయినా హక్కుల పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు’’ అని అశోక్ బాబు వివరించారు. -
యూకేలో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం(యుక్త) ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించింది. తూర్పు లండన్‌లోని బీకాన్ట్రీలో నిర్వహించిన ఈ వేడులకు వెయ్యి మందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యా భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.నంద కుమార, ప్రత్యేక అతిథిగా తెలుగు ప్రవాసులు అధికంగా నివసించే ఈస్ట్ హాం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలేహ జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు యుకె అధ్యక్షుడు నాయక్ విచ్చేశారు. ప్రతి ఉగాది పండుగ ఒక యుగాదికి నాంది అని, ఉక్త అంటే సరస్వతీ వాక్కు, యుక్త అంటే పవిత్రమైనదని నందకుమార అన్నారు. సూర్యగమనాన్ని అనుసరించి ఋతువులు ఏర్పడటం, వాటి ద్వారా పండుగలు జరుపుకోవటం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుందని, అదే మన సంస్కృతికి నాంది అని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ మాట్లాడుతూ బ్రెగ్జిట్ అధ్యయన కమిటీలో తాను సభ్యుడని, భారతదేశంతో మైత్రి, సత్సంబంధాల ద్వారా మాత్రమే అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కునే మనోబలాన్ని బ్రిటన్ పొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువారితో తనకున్న అనుబంధం విడదీయలేనిదని చెప్పారు. అనంతరం సంప్రదాయ రీతిలో పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హేవిళంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులకు, అనేక రంగాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఎయిర్ఇండియా యుకె ప్రాంతీయ అధికారిణి తారా నాయుడు, ఇటీవల విజయవంతమైన పెళ్లిచూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేని ఉగాది పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు. తెలుగు సంఘాలను అనుసంధానం చేస్తూ పండుగల ద్వారా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రవాసులను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న ధ్యేయాన్ని యుక్తా ఈ ఉగాది వేడుకల ద్వారా శ్రీకారం చుడుతోందని అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ తో కలిసి తెలంగాణ చేనేత కార్మికుల సహాయార్ధం పోచంపల్లి, గద్వాల్ వస్త్ర శ్రేణి ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం యుక్తా నూతన వెబ్ సైట్ ఆవిష్కరించారు. ఆహూతులందరికీ ఉగాది పచ్చడి, కమ్మని తెలుగు భోజనం వడ్డించారు. రమ్య, సుజాత తలాడి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యుక్తా ట్రస్టీ లు శ్రీమతి గీత మోర్ల, డా. వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, ఐటి కార్యదర్శి క్రిష్ణ యలమంచిలి, మీడియా కార్యదర్శి రుద్ర వర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుభొట్ల, మానవ వనరుల అభివృద్ధి కార్యదర్శి ఉదయ్ అర్యన్ ఆరేటి, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, క్రీడలు కార్యదర్శి సుధీర్ కొండూరు, కృష్ణ సనపల, సమాచార మరియు ఐటి ఆదిత్యవర్దన్ అల్లాడి , అమరనాథ్ రెడ్డి, కార్తీక్‌లు పాల్గొన్నారు. -
లక్నోలో ఘనంగా ఉగాది వేడుకలు
-
లక్నోలో ఘనంగా ఉగాది వేడుకలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఆదివారం తెలుగు సంఘం వేడుకలు హేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు పెద్ద సంఖ్యలో సభ్యులు, అతిథులు తదితరులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంత్రి సృతంతసింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉగాది పర్వదినంపై ప్రసగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన నృత్యాలు, పేరిణి శివతాండవం, మహిషాసుర మర్ధిని, జానపద గీతాలు, మిమిక్రీ, లక్నో తెలుగు సంఘం కళాకారులు చేసిన కార్యక్రమాలు కనువిందు చేశాయి. తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు డీ ఎన్ రెడ్డి, అన్నంరాజు రజనీకాంత్, కేవీఎన్ రావు, మట్ట సంధ్య, విజయలక్ష్మీ, సుచిత్రలు కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు.