శశికళ - జయలలిత
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తున్నారు. బెయిలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో హైకోర్టు చుట్టుపక్కల భద్రతను పటిష్టం చేశారు. హైకోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు సీబీఐ కోర్టు గత నెల 27న నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, తమిళనాడులో జయలలితకు ఓ పక్క మద్దతు పెరుగుతోంది. మరోపక్క రాష్ట్రంలో పరిస్థితులు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి.