సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలో కొత్త విధానం | Tenth new policy in CBSE exam | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలో కొత్త విధానం

Published Thu, Feb 2 2017 1:58 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

Tenth new policy in CBSE exam

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా మొత్తం సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది. రాత పరీక్షతోపాటు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో చెరో 33శాతం మార్కులు సాధించాలి. 2017–18 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ బుధవారం  ప్రకటించింది.

బోర్డు ఎగ్జామ్‌ నుంచి 80 మార్కులను, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ నుంచి 20మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. గతంలో ఈ వెయిటేజీ 60: 40శాతంగా ఉండేది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా గతంలో ఉండే 4 అసెస్‌మెంట్లకు బదులుగా కొత్తగా 3 పరీక్షలు రాయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement