internal assessment
-
జూలై 31లోగా తుది ఫలితాలు ప్రకటించండి
న్యూఢిల్లీ: 12వ తరగతి ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలను జూలై 31వ తేదీలోగా ప్రకటించాలని రాష్ట్రాల బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నల్ అసెస్మెంట్ విషయంలో అన్ని బోర్డులు ఒకే విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని, ఆ మేరకు బోర్డులకు స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏకరూప(యూనిఫామ్) విధానం ఉండాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. సొంత విధానాన్ని సాధ్యమైనంత త్వరగా రూపొందించుకోవాలని, గురువారం నుంచి 10 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా 12వ తరగతి ఫలితాలను ప్రకటించాలని ఉద్ఘాటించింది. ఫలితాల ప్రకటనకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ తరహాలో ఒక టైమ్‌లైన్ ఏర్పాటు చేసుకోవాలని, జూలై 31లోగా తుది ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్పై బోర్డులు స్వయంగా రూపొందించుకొనే విధానంలో తాము జోక్యం చేసుకోబోమంది. ప్రతి బోర్డుకు స్వయం ప్రతిపత్తి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. సొంత ఇంటర్నల్ అసెస్మెంట్ విధానం ద్వారా ప్రకటించిన తుది ఫలితాలపై విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. -
బీజేపీ ఓటమి ఖాయం
న్యూఢిల్లీ: బీజేపీ ఓటమి పాలు కావడం ఖాయమని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చెప్పారు. నాలుగు దశల పోలింగ్ సరళిని చూశాక బీజేపీ అధికారం కోల్పోయేలా ఉందని, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేని ప్రధాని ముఖంలో భయం కనిపిస్తోందన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చవిచూస్తుందని తమ పార్టీ అంతర్గత విశ్లేషణలో వెల్లడైందని చెప్పారు. ‘పైకి తెలియని ప్రభావంతో బీజేపీ ఓడిపోనుంది. వారి ప్రచారం భయంభయంగా సాగింది. ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేని మోదీ ముఖంలో భయం కనిపించింది’ అని అన్నారు. ఆయనకు మీరైనా చెప్పండి..! ప్రధానిగా మోదీ ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడంపై ఆయన మాట్లాడుతూ..‘కనీసం రెండు ప్రెస్మీట్లైనా పెట్టకపోవడం మంచిది కాదని మోదీకి మీరైనా చెప్పండి’ అని మీడియాను కోరారు. అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడే ప్రధానికి దేశీయ మీడియా ఎదుర్కొనేంత సాహసం లేదని ఎద్దేవా చేశారు. భారత సైన్యం ప్రధాని మోదీ సొంత ఆస్తి కాదని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. సైన్యం, నావికా వైమానిక దళాలను వ్యక్తిగత ఆస్తి అనుకుంటున్నారని ప్రధానిపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలో కొత్త విధానం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా మొత్తం సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది. రాత పరీక్షతోపాటు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో చెరో 33శాతం మార్కులు సాధించాలి. 2017–18 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. బోర్డు ఎగ్జామ్ నుంచి 80 మార్కులను, ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి 20మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. గతంలో ఈ వెయిటేజీ 60: 40శాతంగా ఉండేది. ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా గతంలో ఉండే 4 అసెస్మెంట్లకు బదులుగా కొత్తగా 3 పరీక్షలు రాయాలి.