class X examination
-
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలో కొత్త విధానం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా మొత్తం సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది. రాత పరీక్షతోపాటు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో చెరో 33శాతం మార్కులు సాధించాలి. 2017–18 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. బోర్డు ఎగ్జామ్ నుంచి 80 మార్కులను, ఇంటర్నల్ అసెస్మెంట్ నుంచి 20మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. గతంలో ఈ వెయిటేజీ 60: 40శాతంగా ఉండేది. ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా గతంలో ఉండే 4 అసెస్మెంట్లకు బదులుగా కొత్తగా 3 పరీక్షలు రాయాలి. -
మార్చి 28న టెన్త్ సోషల్–1 పరీక్ష!
హైదరాబాద్: వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 28వ తేదీన సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయానికి వచ్చింది. మార్చి 29వ తేదీన ఆ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకు షెడ్యూలును జారీ చేసినా ఆ రోజు ఉగాది పండుగ ఉండటంతో ముందుగానే (28వ తేదీన) పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూలుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించింది. నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది. -
తండ్రుల మరణం తీరని శోకం!
పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు తండ్రుల మరణం ఆ విద్యార్థులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆశలు చిగురించే సమయంలో ఆశయాలు మోడువారేలా చేసింది. అయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. చదువుపై ఉన్న మమకారంతో కన్నీళ్లను దిగమింగారు. పదోతరగతి పరీక్షకు హాజరై, తండ్రుల ఆకాంక్షను నెరవేర్చారు. రావుకుప్పం/యాదమరి: యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజు వేస్తూ షాక్‌కు గురై మృతిచెందిన విషయం తెల్సిందే. సోమవారం అతనికి దహనక్రియలు నిర్వహించారు. ఇతని కుమార్తె చేతన స్థానిక షిరిడీ సాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కళ్లెదుటే విగతజీవిగా ఉన్న తన తండ్రిని చూస్తూ సోమవారం ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షకు వెళ్లలేకపోయింది. బాధను దిగమింగుకున్నా తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తండ్రి మృతదేహం మీదపడి బోరున విలపించేసింది. బంధువులు ఓదార్చి పరీక్షకు వెళ్లాలని నచ్చజెప్పారు. తండ్రి అంత్యక్రియల అనంతరం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరైంది. రామకుప్పం మండలంలో.. రామకుప్పం మండలం పల్లికుప్పం గ్రావూనికి చెందిన సోవుశేఖర్ (42) ట్రాక్టర్ డ్రైవర్. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కుమారుడు కార్తీక్ సోవువారం ఉదయుం పదో తరగతి పరీక్షకు హాజరయ్యేందుకు గ్రామంలోని బస్టాండుకు చేరుకున్నాడు. అంతలో అతని తండ్రి మృతిచెందాడు. ఆ దుర్వార్త కార్తీక్‌కు తెలియనీయకుండా ఉండాలని కుటుంబ సభ్యులు నిర్ణయిం చారు. పరీక్ష పూర్తయిన తర్వాత కార్తీక్ సహచర విద్యార్థులతో కలిసి బస్సులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో విషయం తెలుసుకుని బోరున విలపించాడు. -
పదిలో మాస్ కాపీయింగ్
♦ పీఈటీలు, డ్రాయింగ్ టీచర్లతో బిట్ పేపర్ చెప్పిస్తున్న వైనం ♦ శ్రీకాకుళం పాఠశాలలో యథేచ్ఛగా కాపీయింగ్ ♦ చర్యలు చేపట్టని విద్యాశాఖాధికారులు ‘పది’లో మాస్ కాపీయింగ్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు, ఇన్విజిలేటర్లే పలువురు పాత్రధారులు కావటంతో కష్టపడి చదివిన విద్యార్థులు విస్తుపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మచిలీపట్నం : పదో తరగతి పరీక్షలలో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతుండటం విద్యార్థులకు శాపంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు అధికారులు, ఇన్విజిలేటర్ల వైఖరితో నిర్ఘాంతపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా స్క్వాడ్ బృందాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలపాలవుతోంది. పరీ క్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కొందరు ఉపాధ్యాయుల వైఖరి కారణంగా పది పరీక్షల నిర్వహణ అభాసుపాలవుతోంది. అయితే విద్యాశాఖాధికారులు మాత్రం చర్యలు తీసుకుంటామని చెబుతూ తప్పించుకుతిరుగుతున్నారు. విద్యార్థుల జంబ్లింగ్ విధానం లోపభూయిష్టంగా ఉండటం గమనార్హం. అంగలూరు..., శ్రీకాకుళం..., చిన్నాపురం.. గుడివాడ పరిధిలోని అంగలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఓ పీఈటీ ఈ నెల 24న పరీక్ష హాలులో బిట్ పేపర్ చెబుతూ స్క్వాడ్ బృందానికి దొరికిపోయారు. ఈ వ్యవహారం మొత్తాన్ని స్క్వాడ్ బృందంలో సభ్యుడిగా ఉన్న డెప్యూటీ తహశీల్దార్ వీడియో తీసి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. పీఈటీని ఇన్విజిలేటర్ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ ఉపాధ్యాయుడ్ని సస్పెం డ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తుండటంతో తనదైన శైలిలో పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఘంటసాల మండలం శ్రీకాకుళం జెడ్పీ ఉన్నత పాఠశాలలో యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో శనివారం సిట్టింగ్ స్క్వాడ్ బృందాన్ని అక్కడకు పంపారు. బందరు మండలం చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ డ్రాయింగ్ టీచర్ బిట్ పేపరు ప్రతి తరగతి గదికి వెళ్లి జవాబులు చెబుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా విద్యార్థులు అదేమిటని ప్రశ్నిస్తే జవాబులు సక్రమంగా రాయలేని వారు బిట్ పేపరు అయినా పూర్తిచేస్తే పాస్ అవుతారు కదా అని ఉపాధ్యాయులు అనటం గమనార్హం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఈవో ఎ.సుబ్బారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా అంగలూరు పాఠశాలలో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న పీఈటీని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. శ్రీకాకుళం పాఠశాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్‌ను పెంచుతామన్నారు. ఇన్విజిలేటర్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే ఇంటి వద్ద చదవకుండానే పిల్లలు పరీక్షకు హాజరయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా నిఘా పెంచుతామని చెప్పారు. -
‘ఫోన్లు కావాలనే తెస్తున్నారా..?’
హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్ తీసుకురావద్దని చెబుతున్నా మారట్లేదు. ఫోన్ తీసుకొస్తే పరీక్ష విధుల నుంచి తప్పించడం మినహా మరే ఇతర శిక్ష లేదు. దీంతో విధుల నుంచి తప్పించుకునేందుకే కొందరు టీచర్లు ఫోన్లు తెస్తున్నట్లు సమాచారం. గురువారం జరిగిన ద్వితీయ భాష పరీక్ష సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు ఇన్విజిలేటర్లు దొరికిపోయారు. దీంతో వారిని పరీక్ష విధుల నుంచి తొలగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారితో సహా 13 మందిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఇక వరంగల్ జిల్లాలో ఒకరికి గుండెపోటు వచ్చినందున పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మాల్ ప్రాక్టిస్ విషయంలో ఒక ఇన్విజిలేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే 13 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులను నమోదు చేశారు. -
పుట్టెడు దుఃఖంలోనూ మొక్కవోని దీక్ష
తండ్రి మరణవార్తను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి చౌడేపల్లె: తండ్రి మరణవార్త విని పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు చౌడేపల్లె మండలానికి చెందిన ఓ విద్యార్థి. చౌడేపల్లె మండలం చారాల గ్రామానికి చెందిన బి.నరసింహారెడ్డి(49) బుధవారం మృతిచెందాడు. ఆయన కుమారుడు కార్తీక్ దుఃఖాన్ని దిగమింగుకుని బుధవారం పరీక్షకు హాజరయ్యాడు. గైర్హాజరైతే ఒక యేడాది వృధా అవుతోందని పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియలను పూర్తిచేశారు. వడదెబ్బతో తండ్రి మృతి కార్తీక్ తండ్రి నరసింహారెడ్డి కూలి పనులు చేసుకుని జీవించేవాడు. వారం క్రితం వడదెబ్బ తగలడంతో విరేచనాలు అయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతను కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.