పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు
తండ్రుల మరణం ఆ విద్యార్థులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆశలు చిగురించే సమయంలో ఆశయాలు మోడువారేలా చేసింది. అయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. చదువుపై ఉన్న మమకారంతో కన్నీళ్లను దిగమింగారు. పదోతరగతి పరీక్షకు హాజరై, తండ్రుల ఆకాంక్షను నెరవేర్చారు.
రావుకుప్పం/యాదమరి: యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజు వేస్తూ షాక్‌కు గురై మృతిచెందిన విషయం తెల్సిందే. సోమవారం అతనికి దహనక్రియలు నిర్వహించారు. ఇతని కుమార్తె చేతన స్థానిక షిరిడీ సాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. కళ్లెదుటే విగతజీవిగా ఉన్న తన తండ్రిని చూస్తూ సోమవారం ఇంగ్లిష్ పేపర్-2 పరీక్షకు వెళ్లలేకపోయింది. బాధను దిగమింగుకున్నా తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తండ్రి మృతదేహం మీదపడి బోరున విలపించేసింది. బంధువులు ఓదార్చి పరీక్షకు వెళ్లాలని నచ్చజెప్పారు. తండ్రి అంత్యక్రియల అనంతరం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరైంది.
రామకుప్పం మండలంలో..
రామకుప్పం మండలం పల్లికుప్పం గ్రావూనికి చెందిన సోవుశేఖర్ (42) ట్రాక్టర్ డ్రైవర్. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కుమారుడు కార్తీక్ సోవువారం ఉదయుం పదో తరగతి పరీక్షకు హాజరయ్యేందుకు గ్రామంలోని బస్టాండుకు చేరుకున్నాడు. అంతలో అతని తండ్రి మృతిచెందాడు. ఆ దుర్వార్త కార్తీక్‌కు తెలియనీయకుండా ఉండాలని కుటుంబ సభ్యులు నిర్ణయిం చారు. పరీక్ష పూర్తయిన తర్వాత కార్తీక్ సహచర విద్యార్థులతో కలిసి బస్సులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో విషయం తెలుసుకుని బోరున విలపించాడు.