​‘కేం‍ద్రం ప్లాస్టిక్‌ కార్డులు అమ్ముతోంది’ | The Govt is acting like a salesman: mamatha | Sakshi
Sakshi News home page

​‘కేం‍ద్రం ప్లాస్టిక్‌ కార్డులు అమ్ముతోంది’

Published Thu, Dec 8 2016 8:05 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

​‘కేం‍ద్రం ప్లాస్టిక్‌ కార్డులు అమ్ముతోంది’ - Sakshi

​‘కేం‍ద్రం ప్లాస్టిక్‌ కార్డులు అమ్ముతోంది’

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెద్ద నోట్ల రద్దు విషయంలో అవకాశం దొరికిన ప్రతిసారి ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలతో ఎండగడుతున్నారు. ఈ ప్రభుత్వం ఓ సేల్స్మెన్‌లాగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడం ప్రారంభించారు. దుకాణాలు తెరిచి ప్లాస్టిక్‌ కార్డులు అమ్ముకోవడం ప్రారంభించారు. స్వైపింగ్‌ మిషన్ల అమ్మకాన్ని ఈ మాదిరిగా పెంచుతున్నారు. అసలు సమస్య నుంచి వారు పక్కకు జరిగారు. రోజురోజుకు వారు తప్పులను మించినతప్పులు చేస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన అంశంపై నుంచి పక్కకు తప్పించేందుకు కేంద్రం ఈ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement