ప్రపంచానికే మహరాజు | The most luxurious train in the world | Sakshi
Sakshi News home page

ప్రపంచానికే మహరాజు

Published Wed, Jul 9 2014 1:04 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ప్రపంచానికే మహరాజు - Sakshi

ప్రపంచానికే మహరాజు

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైలు ఏదీ?

అంటే ఏ అమెరికా వాళ్లదో.. బ్రిటన్‌వాళ్లదో అయ్యుంటుందని అనుకుంటాం.. కానీ కాదు! అది మన రైలే. పేరు ‘మహరాజాస్ ఎక్స్‌ప్రెస్’. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న ఈ రైల్లో ప్రయాణం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, వంటలతోపాటు ప్రకృతి సోయగాలను పరిచయం చేస్తూ చాలా ఆహ్లాదంగా సాగుతుంది. ఈ రైలు వాయవ్య, మధ్య భారత దేశంలో 12 గమ్యస్థానాల మీదుగా ఐదు మార్గాల్లో నడుస్తుంది.  2010లో ఈ రైలు సేవలు ప్రారంభించారు.

►  ఒత్తిడితో పనిచేసే సస్పెన్షన్ వ్యవస్థ, లైవ్ టీవీ, వైఫై, అటాచ్డ్ బాత్‌రూమ్, బార్, విశాలమైన భోజనశాల, లాంజ్, సురక్షితమైన టెలిఫోన్ సౌకర్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఈ రైల్లో నీటి శుద్ధి ప్లాంటు కూడా ఉంది.
►   మొత్తం 23 బోగీలకుగాను.. 14 బోగీల్లో వసతి ఏర్పాటు ఉంటుంది. మొత్తం 88 మంది వరకు ప్రయాణించవచ్చు.
►    బోగీల్లో నాలుగు రకాల కేటగిరీలు- ప్రెసిడెన్షియల్ సూట్, డీలక్స్ కేబిన్లు, జూనియర్ సూట్, సూట్- ఉన్నాయి. హెరిటేజ్ ఆఫ్ ఇండియా ప్యాకేజీ(ఎనిమిది రోజులు)లో ప్రెసిడెన్షియల్ సూట్‌లో ప్రయాణించాలంటే.. పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 14.5 లక్షల దాకా ఖర్చవుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.2 లక్షలన్నమాట!
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement