IRTC
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
ఏసీ రైలు ఎక్కేవారేరీ?
సామాన్యుడి చౌక ప్రయాణ సాధనం రైలుబండికి కొన్ని వర్గాల ప్రయాణికులు మాత్రం క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యేకంగా ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశం నలువైపులా అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, కేవలం ఒకటి, రెండు గంటల్లోనే గమ్యస్థానానికి చేరే అవకాశం ఉండడంతో విమాన ప్రయాణానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ ట్రైన్ చార్జీల కంటే విమాన చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లైట్ జర్నీ వైపు మళ్లుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మారిన ప్రయాణికుల ధోరణి కారణంగా..పండుగలు, వరుస సెలవులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్ విమానాలు 80 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రైళ్లలో ఖాళీగా ఏసీ బెర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని సువిధ రైళ్లలో విమానాల తరహాలో చార్జీలను పెంచుతున్నారు.కానీ పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఇంచుమించు అదే చార్జీల్లో ఫ్లైట్ టిక్కెట్ వచ్చేస్తుంది. పైగా కొన్ని ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీలు ప్రయాణికులకు రకరకాల ఆఫర్లను అందజేస్తున్నాయి. దీంతో చాలా మంది విమాన ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎక్కువ సమయమే కారణమా... హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, విశాఖ, తిరుపతి, భువనేశ్వర్, పటా్న, ధానాపూర్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లు 12 గంటల నుంచి 18 గంటల వరకు ప్రయాణం చేస్తాయి. ఇప్పటికీ చాలా రైళ్లు గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోనే నడస్తున్నాయి.కొన్ని రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచేందుకు పట్టాల సామర్ధ్య పెంపునకు చర్యలు చేపట్టారు. కానీ పెద్దగా రైళ్ల వేగం పెరగలేదు. దీంతో రూ.2500 నుంచి సుమారు రూ.4000 వరకు చార్జీలు చెల్లించి గంటల తరబడి ప్రయాణం చేసేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయవలసిన వాళ్లు ఫ్లైట్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ‘ఇంటిల్లిపాది వెళ్లవలసినప్పుడు ట్రైన్లోనే వెళ్తున్నాం. కానీ ఒక్కరు, ఇద్దరు వెళ్లవలసినప్పుడు మాత్రం ఫ్లైట్‌లోనే వెళ్తున్నాం.’ అని హైటెక్‌సిటీకి చెందిన కృష్ణ తెలిపారు. తాము తరచుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. నగరం నుంచి తిరుపతి, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రతి రోజు 5 నుంచి 10 వరకు విమానాలు నడుస్తుండగా ముంబ యి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ నగరాలకు హైదరాబాద్ మీదుగా 15 నుంచి 20 ఫ్లైట్లు అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. చలో ఎయిర్టూర్... మరోవైపు ఐఆర్సీటీసీ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాటు చేసే ఎయిర్ టూర్లకు సైతం ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఉత్తర, దక్షిణభారత యాత్రలు నిర్వహించే ఐఆర్సీటీసీ రైళ్లతో పాటు విమాన సర్వీసుల్లోనూ ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది . జైపూర్, శ్రీనగర్, తదితర ప్రాంతాలకు ఎయిర్టూర్లు ఉన్నాయి. ఏసీ బెర్తులు ఖాళీ... ♦ హైదరాబాద్ నుంచి పలు మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని రైళ్లలో ఈ నెల 23వ తేదీన ఏసీ బెర్తులు కిందివిధంగా అందుబాటులో ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 23వ తేదీన ఫస్ట్ ఏసీలో 8 బెర్తులు, సెకెండ్ ఏసీలో 15, థర్డ్ ఏసీలో ఏకంగా 101 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఫస్ట్ ఏసీ చార్జీ రూ.4460, సెకెండ్ ఏసీ చార్జీ రూ.2625 ఉంది. ఈ చార్జీలకు కొద్దిగా అటు ఇటుగా విమానచార్జీలు ఉన్నాయి. ♦ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 23వ తేదీన సెకెండ్ ఏసీలో 99, థర్డ్ ఏసీలో 226 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకు ఫస్ట్ ఏసీ చార్జీ రూ.2760, సెకెండ్ ఏసీ రూ.1645 చొప్పున ఉంది. -
తపాలా.. మారుతోందిలా
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు బట్వాడా, ఆర్థిక సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు.. సేవా కేంద్రాలుగా మార్పు చెందుతున్నాయి. రైల్వే టికెట్లు, బస్ టికెట్లు, పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్, పాన్‌కార్డ్ తదితర సేవలన్నీ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా.అభినవ్ వాలియా ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహకారంతో దాదాపు 60కి పైగా సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా 20 వరకు సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి మొబైల్, డీటీహెచ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుకింగ్, ఆర్టీఏ, నేషనల్ పెన్షన్ స్కీం, ఫాస్ట్ ట్యాగ్ తదితర సేవలన్నింటినీ పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు. ఇందుకోసం తపాలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని.. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 3,000 మంది ఆన్లైన్ సేవలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 11 వేలకు పైగా సేవలు.. రాష్ట్రంలో ఇప్పటికే 1,568 పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా మార్చినట్లు అభినవ్ వాలియా తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1.26 కోట్ల విలువైన 11 వేలకు పైగా సేవలను అందించామని పేర్కొన్నారు. ప్రతి సేవకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ నెలలో మరో 500 పోస్టాఫీసుల్లో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్టాఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐఆర్టీసీ ద్వారా రైల్వే టికెట్లు 50 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ విధంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. -
ఆ తప్పు చేయను; రూ.2 లక్షల జీతం ఇవ్వండి
న్యూఢిల్లీ : నకిలీ సాఫ్ట్‌వేర్‌తో భారతీయ రైల్వేకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన నిందితుడు హమీద్ అష్రఫ్ ఓ ‘కొత్త’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. విదేశాల్లో తలదాచుకుంటున్న అష్రఫ్ తనపై కేసులు ఎత్తివేసి ఎథికల్ హ్యాకర్‌గా నియమించుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. అందుకోసం నెలకు రూ.2 లక్షలు జీతంగా ఇవ్వాలని రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీకి విఙ్ఞప్తి చేస్తూ సందేశాలు పంపాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అష్రఫ్‌కు గ్యాంగ్‌లో ఒకరైన గులాం ముస్తాఫా కూడా ఉన్నాడు. (చదవండి : ‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు) బెయిల్‌పై వచ్చి జంప్ అయ్యాడు.. ఐఆర్టీసీ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించిన అష్రఫ్ దానిని భారీ మొత్తానికి కొందరికి అమ్మేశాడు. ఈ ఉదంతంపై ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’ పేరుతో ఆర్పీఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది. కుంభకోణంలో కీలకమైన గులాం ముస్తాఫాను అరెస్టు చేసింది. విదేశాలకు పారిపోయిన అష్రఫ్ కోసం గాలిస్తోంది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు కేసును ఛేదించిన ఆర్పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మీడియాకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనేపథ్యంలోనే అష్రఫ్ కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఐఆర్టీసీ ఈ-టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాల కారణంగానే తాను.. నకిలీ వెబ్సైట్ రూపొందించానని అష్రఫ్ చెప్పుకొచ్చాడు. ఐఆర్టీసీ వెబ్సైట్లో లోపాల్ని గతంలో తాను లేవనెత్తితే పిచ్చోడి మాదిరిగా చూశారని వెల్లడించాడు. తనను శిక్షిస్తే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడదని.. మరికొంతమంది నకిలీ సాఫ్ట్వేర్ రూపొందించి మోసాలకు పాల్పడతారని పేర్కొన్నాడు. ఎథికల్ హ్యాకర్‌గా పనిచేసి భారతీయ రైల్వే ఈ-టికెటింగ్‌లో లోపాల్ని సరిచేస్తానని అష్రఫ్ సెలవిచ్చాడు. కాగా, 2016లో ఈ-టికెటింగ్‌కు సంబంధించి ఓ కేసులో అరెస్టైన అష్రఫ్ బెయిల్ పొందాడు. అనంతరం దుబాయ్‌కి జంప్ అయ్యాడు. -
రూ.35 కోసం రెండేళ్ల పోరాటం..!
ముంబై : సర్వీస్ టాక్స్ పేరుతో తన వద్ద అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓ వ్యక్తి చేసిన రెండేళ్ల పోరాటం పలించింది. అతని వద్ద వసూలు చేసిన మొత్తాన్ని ఐఆర్టీసీ చెల్లిచింది. కోటాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ.765. అయితే, 2017 జూలై 1న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చిన కారణంగా అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. రిఫండ్‌గా రూ.100 తగ్గించుకొని ఐఆర్టీసీ అతనికి 665 చెల్లించింది. క్లరికల్ చార్జీలుగా రూ.65, సర్వీస్ టాక్స్‌గా రూ.35 కట్ చేసుకుంది. అయితే, లెక్క ప్రకారం తన దగ్గర క్లరికల్ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్ టాక్స్ అదనంగా వసూలు చేశారని సదరు ప్రయాణికుడు లోక్ అదాలత్‌లో పిటిషన్ వేశాడు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఈ జనవరిలో లోక్ అదాలత్ స్పష్టం చేసింది. చివరగా ఆర్టీఐని ఆశ్రయించిన ప్రయాణికుడికి అనుకూల సమాచారం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చే ముందు బుక్ చేసుకున్న టికెట్లపై విధించిన సర్వీస్ టాక్స్ చెల్లించాలని ఆర్టీఐ వెల్లడించింది. ఆర్టీఐ కాపీని అటాచ్ చేస్తూ.. ఐఆర్‌టీసీని సంప్రదించడంతో అతని బ్యాంక్ ఖాతాలో రూ.33 జమ చేసింది. మరో రూ.2 కోత విధించింది. తనను ఇబ్బందులకు గురిచేయడంతో రెండు రూపాయలు కోత విధించారని, ఐఆర్‌టీసీపై మరోసారి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జీఎస్టీ కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికుల ద్వారా ఐఆర్‌టీసీకి ఏటా రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరుతోంది. -
సెప్టెంబర్ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఐఆర్సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పిస్తామన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ రెండు రైల్వే కంపెనీల ఐపీఓల ద్వారా రూ.1,500 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలనే కేంద్రం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో 12.2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.480 కోట్లు సమీకరించింది. ఐఆర్ఎఫ్సీపై తుది నిర్ణయం.... ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఐపీఓను ఈ ఏడాది మొదట్లోనే తేవాలని ప్రభుత్వం భావించింది. ఐఆర్ఎఫ్సీ స్టాక్ మార్కెట్లో లిస్టైతే, వడ్డీ వ్యయాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషయమై కేంద్ర కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రైల్వేలకు సంబంధించి విస్తరణ ప్రణాళికలకు కావలసిన నిధులను ఐఆర్ఎఫ్సీ క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరిస్తుంది. ఇక రైల్వేలకు చెందిన కేటరింగ్, టూరిజమ్ కార్యకలాపాలను ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. 2017లోనే లిస్టింగ్ నిర్ణయం... ఐదు రైల్వే కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్రతిపాదనను 2017 ఏప్రిల్‌లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైట్స్, ఆర్వీఎన్ఎల్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ లిస్ట్ కావలసి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.90,000 కోట్లు సమీకరించాలని ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
మరింత చేరువలోకి రైల్వే టికెట్ల బుకింగ్
న్యూఢిల్లీ: రైల్వే టికెట్ల బుకింగ్‌ను సామాన్యులకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా సీఎస్సీ ఈ–గవర్నెన్స్‌తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 2.9 లక్షల సాధారణ సేవా కేంద్రాలన్నింటిలోనూ (సీఎస్సీ) రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. సీఎస్‌సీని నిర్వహించే వారికి ప్రతి టికెట్‌పై రూ. 10 కమీషన్ లభిస్తుంది. ప్రస్తుతం 40,000 సీఎస్సీల్లో మాత్రమే ఈ సదుపాయం ఉందని, 8–9 నెలల్లో మిగతా అన్ని చోట్లా దీన్ని అందుబాటులోకి తెచ్చేలా ఐఆర్సీటీసీ చురుగ్గా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. అలాగే, సీఎస్సీల్లో ఎక్స్టెన్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించేందుకూ ముందుకు రావాలని బ్యాంకులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 60,000 పైచిలుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటు టెలికం శాఖ 5,000 వైఫై చౌపల్స్ను ప్రారంభించింది. -
ఓ టూరేద్దాం..
ఐఆర్సీటీసీ వేసవి ప్యాకేజీలు సిద్ధం ఢిల్లీ నుంచి ‘మహారాజా’ పయనం సిటీబ్యూరో: వేస‘విహారాని’కి ఐఆర్సీటీసీ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను ప్రకటించింది. మండుటెండల్లో ఇంటిల్లిపాదీ కలిసి హాయిగా గడిపేందుకు అనువైన కూల్ ట్రిప్స్ కూడా ఈ పర్యటనల్లో ఉన్నాయి. ప్యాకేజీల వివరాలను ఐఆర్‌సీటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్యాకేజీల వివరాలు.. జమ్ము నుంచి కాట్రా, శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి జమ్ముకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగుతుంది. ఈ పర్యటనకు ఒక్కొక్కరికి రూ. 15,890 చార్జీ ఉంటుంది.మాతా వైష్ణోదేవి యాత్రా పర్యటన.. జమ్ము, శ్రీనగర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాల్లో 7 రాత్రులు, 8 పగళ్లు పర్యటన ఉంటుంది. చార్జీ రూ.15,020.జన్మత్-ఇ కశ్మీర్ మాతా వైష్ణోదేవి ఆలయ పర్యటనలో శ్రీనగర్ నుంచి బయలుదేరి జమ్ము చేరుకుంటారు. 7 రాత్రులు, 8 పగళ్లకు రూ.14,480 చార్జీ. డిస్కవర్ అమేజింగ్ కాశ్మీర్ ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, సోన్మార్గ్ పర్యటన ఉంది. 5 రాత్రులు, 6 పగళ్లకు రూ.10,910 చార్జీ ఉంది. నార్త్ ఈస్ట్ డిలైట్స్ ప్యాకేజీలో న్యూ జుల్పాయ్‌గురి, బడోగ్రా, డార్జిలింగ్, పెలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరిగి న్యూ జల్పాయ్గురి చేరుకుంటారు. చార్జీ రూ. 20,217. ది స్ప్లెండర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మరో టూరిజం ప్యాకేజీ. న్యూ జల్పాయ్గురి, బడోగ్రా, డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, కలింపాంగ్ తదితర ప్రాంతాల్లో పర్యటన కొనసాగుతుంది. చార్జీ రూ.16,001. హిమాచల్ పర్యటన సికింద్రాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో సిమ్లా, కుఫ్రీ, కులు-మనాలి, రోహ్తక్ పాస్, చండీఘర్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఒక్కొక్కరికి రూ.11,740 చార్జీ ఉంటుంది. ‘మహారాజా’లో ప్రయాణం.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ట్రైన్‌గా ప్రసిద్ధి చెందిన ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’లో కూడా పర్యటించవచ్చు. విశాలమైన బెడ్రూమ్స్, డైనింగ్ హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా వివిధ పర్యాటక ప్రాంతాలకు ఇది రాకపోకలు సాగిస్తుంది. విదేశీ టూరిస్టులు ఎక్కువగా ఈ ట్రైన్లో పర్యటిస్తారు. ముంబయి, అజంతా, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీల్లో 8 పగళ్లు, 7 రాత్రులు పర్యటన ఉంటుంది. ఈ-కేటరింగ్ సదుపాయం దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఏ, ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కోరుకున్న ఆహార పదార్థాలను అందించేందుకు ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేసింది. టిక్కెట్ బుకింగ్‌తో పాటే ఐర్సీటీసీ వెబ్సైట్లో ఈ కేటరింగ్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ట్రైన్ నుంచి క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. -
ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ ఇక ఈజీ!
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ ద్వారా రైళ్ల టికెట్లను బుక్ చేయడంలో ఎదురవుతున్న కష్టాలకు ముగింపు పలుకుతూ.. కొత్త తరం ‘ఈ టికెటింగ్’ వ్యవస్థను రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. పూర్తిగా ఆధునీకరించిన ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను రైల్వే మంత్రి సదానంద గౌడ బుధవారం ప్రారంభించనున్నారు. ఆ వెబ్సైట్లో ఆధునీకరణ తరువాత టికెట్ బుకింగ్ సామర్థ్యం నిమిషానికి ప్రస్తుతం ఉన్న 2000 టికెట్ల నుంచి 7200 టికెట్లకు పెరుగుతుంది. -
ఆహారంలో బొద్దింక... ఐఆర్సీటీసీకి లక్ష జరిమానా
న్యూఢిల్లీ: గత నెల వివిధ రైళ్లలో నాసిరకం ఆహారం అందించినందుకు తమ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సహా 9 క్యాటరింగ్ సంస్థలపై రైల్వేశాఖ కొరడా ఝళిపించింది. కోల్‌కతా రాజధాని రైల్లో సరఫరా చేసిన ఆహారంలో బొద్దింక ఉండటంతో ఐఆర్సీటీసీకి రూ. లక్ష జరిమానా విధించింది. మొత్తంమీద 9 సంస్థలపై రూ. 11.50 లక్షల జరిమానా విధించింది. జరిమానాపడ్డ సంస్థల్లో ఆర్.కె. అసోసియేట్స్, సన్‌షైన్ క్యాటరర్స్, సత్యంత క్యాటరర్స్, బృందావన్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఉన్నాయి. గత నెల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, 13 రైళ్లలో నాసిరకం ఆహారం అందినట్లు గుర్తించామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. . తాము తనిఖీలు నిర్వహించిన రైళ్ల జాబితాలో కోల్‌కతా రాజధానితోపాటు పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయన్నారు. కొన్ని రైళ్లలో ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచగా మరికొన్ని రైళ్లలో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామని ఆ అధికారి చెప్పారు. దీంతో రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ జరిమానాలు విధించామని ఆయన తెలిపారు. -
ఐఆర్సీటీసీ పర్యాటక రైళ్లు..
హైదరాబాద్ : పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను న డుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. శబరిమలై, రామేశ్వరం,వారణాసి,ఢిల్లీ-ఆగ్రా-జైపూర్-మధుర,గయ-ప్రయాగ,తదితర ప్రాంతాలకు వెళ్లే యాత్రికుల కోసం భోజన,వసతి,రోడ్డు రవాణా సదుపాయాలతో ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు హైటెక్స్‌లో జరుగనున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రదర్శనలో ప్రయాణాలు బుక్ చేసుకున్న వారికి 5 శాతం రాయి తీ కూడా లభిస్తుందన్నారు. సికింద్రాబాద్-రామేశ్వరం ప్యాకేజ్డ్ టూర్ ఆగస్టు 13, 20, సెప్టెంబర్ 17 తేదీలలో ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.7,581 చొప్పున చార్జీ ఉంటుంది. సికింద్రాబాద్-వారాణాసి టూర్ ఆగస్టు 8, 15 తేదీలలో ప్రారంభమవుతుంది.మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. రూ.7,381 చొప్పున చార్జీ తీసుకుంటారు. సికింద్రాబాద్-శబరిమలై యాత్ర నవంబర్ 15, వచ్చే సంవత్సరం జనవరి 20 తేదీలలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో రూ.4,178 చొప్పున చార్జీ తీసుకుంటా రు. 4 రాత్రులు,5 పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. అలాగే విజయవాడ-శబరిమలై టూర్ నవంబర్ 15, వచ్చే ఏడాది జనవరి 10 తేదీలలో ప్రారంభమవుతుంది. ఉత్తరాది యాత్రలలో భాగం గా సికింద్రాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. రూ.15,507 చొప్పున చార్జీ తీసుకుంటారు. ఈ ప్రత్యేక ప్యాకే జీల కోసం ప్రయాణికులు ఫోన్ 9701360701 నంబర్‌కు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్ఆర్బి అభ్యర్థులకు ప్రత్యేక రైలు ఆర్ఆర్బీ పరీక్ష నేపథ్యంలో సంత్రాగచ్చి-సికింద్రాబాద్ (08045) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఏపీలో విశాఖపట్టణం,రాజమండ్రి,విజయవాడ, తెలంగాణలో వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. -
ప్రపంచానికే మహరాజు
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైలు ఏదీ? అంటే ఏ అమెరికా వాళ్లదో.. బ్రిటన్వాళ్లదో అయ్యుంటుందని అనుకుంటాం.. కానీ కాదు! అది మన రైలే. పేరు ‘మహరాజాస్ ఎక్స్‌ప్రెస్’. ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న ఈ రైల్లో ప్రయాణం.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, వంటలతోపాటు ప్రకృతి సోయగాలను పరిచయం చేస్తూ చాలా ఆహ్లాదంగా సాగుతుంది. ఈ రైలు వాయవ్య, మధ్య భారత దేశంలో 12 గమ్యస్థానాల మీదుగా ఐదు మార్గాల్లో నడుస్తుంది. 2010లో ఈ రైలు సేవలు ప్రారంభించారు. ► ఒత్తిడితో పనిచేసే సస్పెన్షన్ వ్యవస్థ, లైవ్ టీవీ, వైఫై, అటాచ్డ్ బాత్రూమ్, బార్, విశాలమైన భోజనశాల, లాంజ్, సురక్షితమైన టెలిఫోన్ సౌకర్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఈ రైల్లో నీటి శుద్ధి ప్లాంటు కూడా ఉంది. ► మొత్తం 23 బోగీలకుగాను.. 14 బోగీల్లో వసతి ఏర్పాటు ఉంటుంది. మొత్తం 88 మంది వరకు ప్రయాణించవచ్చు. ► బోగీల్లో నాలుగు రకాల కేటగిరీలు- ప్రెసిడెన్షియల్ సూట్, డీలక్స్ కేబిన్లు, జూనియర్ సూట్, సూట్- ఉన్నాయి. హెరిటేజ్ ఆఫ్ ఇండియా ప్యాకేజీ(ఎనిమిది రోజులు)లో ప్రెసిడెన్షియల్ సూట్లో ప్రయాణించాలంటే.. పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 14.5 లక్షల దాకా ఖర్చవుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.2 లక్షలన్నమాట! -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో వారణాసికి ప్రత్యేక రైలు
విజయవాడ, న్యూస్‌లైన్ : వారణాసి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుంచి ఒక రైలు నడుపుతున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ ట్యూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విజయవాడ రీజనల్ మేనేజర్ ఎన్డి భుజంగరావు తెలిపారు. ఈ రైలులో 5 రాత్రులు, 6 రోజులు ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.7,170 ధర నిర్ణయించామన్నారు. ఆయా ప్రదేశాల్లో రోడ్డు రవాణా, వసతి, గైడ్ సర్వీసు రుసుము కూడా దీన్లో కలిపి ఉందన్నారు. వివరాలకు 0866-2572281 ఫోనులో సంప్రదించాలని ఆయన సూచించారు.