న్యూఢిల్లీ: గత నెల వివిధ రైళ్లలో నాసిరకం ఆహారం అందించినందుకు తమ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) సహా 9 క్యాటరింగ్ సంస్థలపై రైల్వేశాఖ కొరడా ఝళిపించింది. కోల్‌కతా రాజధాని రైల్లో సరఫరా చేసిన ఆహారంలో బొద్దింక ఉండటంతో ఐఆర్‌సీటీసీకి రూ. లక్ష జరిమానా విధించింది. మొత్తంమీద 9 సంస్థలపై రూ. 11.50 లక్షల జరిమానా విధించింది. జరిమానాపడ్డ సంస్థల్లో ఆర్.కె. అసోసియేట్స్, సన్‌షైన్ క్యాటరర్స్, సత్యంత క్యాటరర్స్, బృందావన్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఉన్నాయి.
గత నెల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, 13 రైళ్లలో నాసిరకం ఆహారం అందినట్లు గుర్తించామని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. . తాము తనిఖీలు నిర్వహించిన రైళ్ల జాబితాలో కోల్‌కతా రాజధానితోపాటు పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయన్నారు. కొన్ని రైళ్లలో ఆహారాన్ని అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచగా మరికొన్ని రైళ్లలో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామని ఆ అధికారి చెప్పారు. దీంతో రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ జరిమానాలు విధించామని ఆయన తెలిపారు.
ఆహారంలో బొద్దింక... ఐఆర్‌సీటీసీకి లక్ష జరిమానా
Published Mon, Aug 4 2014 1:12 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement