'శాంతితోనే మానవ జాతి అభివృద్ధి' | The progress of humanity lies in peace, brotherhood & non-violence says modi | Sakshi
Sakshi News home page

'శాంతితోనే మానవ జాతి అభివృద్ధి'

Published Sat, Jun 27 2015 12:24 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

The progress of humanity lies in peace, brotherhood & non-violence says modi

న్యూఢిల్లీ: మానవ జాతి అభివృద్ధి అనేది శాంతి, సోదరభావం, అహింస ద్వారానే సాధ్యం తప్ప.. విద్వేషం, ఉగ్రవాదం, ఇతరులపై దాడులు చేయడం ద్వారా కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన  ప్రాగాఢసానుభూతి తెలిపారు.
 
కువైట్, టునీసియా, సిరియా, ఫ్రాన్స్‌లలో అమాయకులను ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలోనే (పవిత్రమైన శుక్రవారం రోజున) ఉగ్రవాదులు బలిగొన్న విషయం తెలిసిందే. కువైట్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిపి 25 మందిని చంపేశాడు.

 

టునీసియాలోని ఓ బీచ్‌లో మరో ముష్కరుడు పర్యాటకులపై తూటాలు కురిపించి 28 మంది ప్రాణాలు తీశాడు. ఫ్రాన్స్‌లో ఇంకో ఉగ్రవాది ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఒక వ్యక్తిని  అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఇక నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న  సిరియాలో రక్తం రుచి మరిగిన ఐఎస్ ముష్కరులు 146 మందిని హత్య చేశారు. ఈ ఉగ్రవాద చర్యలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement