20 డెంటల్ కాలేజీల గుర్తింపు రద్దు?
న్యూఢిల్లీ: ర్యాగింగ్ను నియంత్రించలేకపోతున్న ఓ 20 డెంటల్ కాలేజీల గుర్తింపును రద్దు చేయనున్నారు. ఈ మేరకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) కేంద్ర ఆరోగ్యశాఖకు ఓ లేఖ రాసింది. మొత్తం 20 కాలేజీలను రద్దు చేయాలని అందులో ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా ర్యాగింగ్ చట్టాలు తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ ఆ విష సంస్కృతి ప్రబలంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని కాలేజీ యాజమాన్యాలు బేఖాతరు చేస్తుండటంతో వాటి గుర్తింపు రద్దు చేయాలని డీసీఐ ప్రతిపాదనలు చేసింది.
డీసీఐ ప్రతిపాదించిన కాలేజీలు ఇవే..
- రీజినల్ డెంటల్ కాలేజీ, గువాహతి
- పాట్నా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పాట్నా
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్, పాట్నా
- మిథిలియా మైనారిటీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దర్భాంగ
- ఈఎస్ఐసీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఢిల్లీ
- ప్రభుత్వ డెంటల్ కాలేజ్, శ్రీనగర్
- ఇందిరాగాంధీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, జమ్మూ
- కేజీఎఫ్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్, బీఈఎంఎల్ నగర్
- ఎఎంఈ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాయచూర్
- హితకారిణి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, జబల్పూర్
- బాబా కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, భోపాల్
- గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఔరంగబాద్
- నాందేడ్ రూరల్ డెంటల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ సెంటర్, నాందేడ్
- శ్రీ బాలాజీ డెంటల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
- రాజేశ్ రామ్ దాస్ జీ కాంబే డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అకోలా
- శ్రీ సుక్మని డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, డెరాబస్సి
- నిమ్స్ డెంటల్ కాలేజ్, జైపూర్
- ఫాకల్టీ ఆఫ్ డెంటల్ సైన్సెస్, కింగ్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్, లక్నో
- హరశరణ్ దాస్ డెంటల్ కాలేజీ, గజియాబాద్
-
స్కూల్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గ్రేటర్ నోయిడా.
గత కొద్ది సంవత్సరాలుగా ఈ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు పెరగడంతోపాటు.. మరణాలు కూడా సంభవించాయని, ఈ నేపథ్యంలో వీటి గుర్తింపు రద్దు చేయాలని డీసీఐ ప్రతిపాదించింది.