థర్డ్ ఫ్రంట్ పార్కింగ్ ప్లేస్ లాంటింది: వెంకయ్య
దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ పార్కింగ్ ప్లేస్ లాంటిదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. థర్డ్ ఫ్రంట్ లోకి పార్టీలు వచ్చి పోయే పార్టీలే ఉంటాయన్నారు. థర్డ్ ఫ్రంట్ వల్ల ప్రభుత్వ ఏర్పాటు జరగదని.. అదోక ఎండమావి అని వెంకయ్య అన్నారు. థర్డ్ ఫ్రంట్ ను నడిపించే నేత లేరని, అందులో ప్రతి ఒక్కరు ప్రధాని కావాలనే ఆశతో ఉన్నారని ఆయన అన్నారు.
యూపీఏ లో జరిగిన అవినీతిలో థర్డ్ ఫ్రంట్ పార్టీలు కూడా భాగస్వాములేనని ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్న లెఫ్ట్, సమాజ్ వాదీ పార్టీ యూపీఏ-1, యూపీఏ-2లో భాగస్వాములేనని ఆయన అన్నారు. కోల్ కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.