కాంగ్రెస్ రక్షించడమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: మోడీ | Third front's only agenda is to save Congress: Narendra Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ రక్షించడమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: మోడీ

Published Tue, Feb 11 2014 4:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

కాంగ్రెస్ రక్షించడమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: మోడీ - Sakshi

కాంగ్రెస్ రక్షించడమే థర్డ్ ఫ్రంట్ ఎజెండా: మోడీ

మూడవ కూటమి(థర్డ్ ఫ్రంట్) ఏర్పాటు కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కసరత్తుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని రక్షించడానికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతోంది అని మోడీ విమర్శించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అలాంటి ఫ్రంట్ లు ఏర్పడితే. .కాంగ్రెస్ పార్టీకి మాత్రమే లాభం జరుగుతుంది అని అన్నారు. 
 
భారత దేశంలో ఇతర ప్రాంతాలు అభివృద్ది చెందినంతగా ఒడిశా ప్రాంతం, తూర్పు ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ఆయన అన్నారు. మీ ప్రాంతం బాగుపడాలంటే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న పార్టీలకు గుణపాఠం నేర్పాలని మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడ కష్టాల్లో ఉన్నా.. థర్డ్ ఫ్రంట్ రంగంలోకి దిగితుందని ఆయన ఆరోపించారు. థర్డ్ ఫ్రంట్ తో భారత రాజకీయాలు ప్రక్షాళన జరగవు అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement