రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి
కోల్‌కతా: సెల్ఫీ మోజు మరో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
హౌరాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని రైలు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ముగ్గురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.