ముగ్గురు బాలికలపై అత్యాచారం.. ఒకరి హత్య! | three minors raped, one killed in rajasthan | Sakshi
Sakshi News home page

ముగ్గురు బాలికలపై అత్యాచారం.. ఒకరి హత్య!

Published Tue, Jun 3 2014 10:36 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

three minors raped, one killed in rajasthan

ఉత్తరప్రదేశ్లో ఇటీవలి కాలంలో వరుసపెట్టి అత్యాచారాలు జరుగుతుండగా, ఇప్పుడు రాజస్థాన్ వంతయింది. మూడు వేర్వేరు సంఘటనలలో అక్కడ ముగ్గురు బాలికలపై అత్యాచారాలు జరగగా, ఒకరు హత్యకు కూడా గురయ్యారు. దీంతో రాష్ట్రప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చేసింది. వెంటనే స్పందించాల్సిందిగా ఆదేశించడంతో నేరాలు జరిగిన 24 గంటల్లోనే మూడు కేసుల్లోనూ నిందితులను అరెస్టు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఒక్క కేసులో మాత్రం ఒక నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు.

సోమవారం రాత్రి తాను తీసుకున్న చర్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె వరుసగా ట్వీట్లు ఇచ్చారు. ''ఈ సంఘటనలకు పాల్పడిన నేరస్థులకు కఠినాతి కఠినమైన శిక్షలు వీలైనంత త్వరగా పడేలా చూడాలని డీజీపీకి సూచనలిచ్చాను.. బాధితులకు న్యాయం జరగడం చాలా ముఖ్యం. వీలైనంత కఠినమైన చర్యలు తీసుకున్నాం. నిందితులను అరెస్టు చేయడమే కాదు, జ్యుడీషియల్ కస్టడీకి కూడా పంపాం'' అని ఆమె తెలిపారు.

శనివారంనాడు ఖోలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన మేకలను మేతకు తీసుకెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం గ్రామానికి కిలోమీటరు దూరంలో ఆమె మరణించి కనిపించింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు ఆమెపై అత్యాచారం చేసి, పీక పిసికి చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. మరో సంఘటనలో నారాయణపుర గ్రామంలో ఐదేళ్ల బాలికపై ఆమె పొరుగింటి వ్యక్తి అఘాయిత్యం చేశాడు. ఇక మూడో కేసులో దౌసా జిల్లాలో 15 ఏళ్ల దళిత బాలికపై ఆమె ఇంట్లోనే అత్యాచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement