ఢిల్లీ: ఓ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కూలిన ఘటన ఢిల్లీ నగరంలోని గౌతంపురి ఏరియాలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. ఈ ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బందితో పాటు అధికారులు పాల్గొని సహాయక చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.