ప్రభుత్వానికి 18 మంది రిటైర్డ్ జడ్జిల జాబితా | To the government a list of 18 retired judges | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి 18 మంది రిటైర్డ్ జడ్జిల జాబితా

Published Fri, Dec 2 2016 2:06 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

To the government a list of 18 retired judges

ఏపీ/తెలంగాణ సహా నాలుగు హైకోర్టుల కోసం ప్రతిపాదన
 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ సహా నాలుగు హైకోర్టుల్లో నియామకానికి సంబంధించి 18 మంది మాజీ జడ్జిల జాబితా కేంద్రానికి అందింది. గుట్టలుగా పేరుకుపోరుున అపరిష్కృత కేసుల పరిష్కారానికి రాజ్యాంగంలోని అసాధారణ నిబంధన కింద మాజీ న్యాయమూర్తులను నియమించేందుకు కేంద్రం, న్యాయ వ్యవస్థ అంగీకారానికి వచ్చారుు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుతోపాటు మధ్యప్రదేశ్, అలహాబాద్, కోల్‌కతా హైకోర్టులు ఇందులో ఉన్నారుు. జాబితాలోని పేర్లను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ట్రాక్ రికార్డు ఆధారంగా గతంలో హైకోర్టుల్లో పనిచేసిన జడ్జిల పేర్లను ఎంపిక చేశారు. గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రులు- ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.  

తాజా నిర్ణయం ప్రకారం హైకోర్టుల్లో నియమితులైన మాజీ న్యాయమూర్తులు ‘ఫైవ్ ప్లస్ జీరో’లక్ష్యాన్ని చేరేందుకూ సహకరించగలుగుతారు. ‘ఫైవ్ ప్లస్ జీరో’ అంటే... ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్య తనిచ్చి పరిష్కరించడం. ఈ కోర్టుల్లో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement