సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తున్నాయి. గతకొద్ది రోజుల వరకు పెద్దగా మనదేశంలో కరోనా ఎఫెక్ట్ కనిపించలేదు. అయితే గడిచిన రెండు రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.
సోమవారం మధ్యాహ్నానికి 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ పేర్కొన్నది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 89 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అందరిని భయపెడుతున్న విషయం. ఒకవేళ మూడు దశలోకి ప్రవేశిస్తే ఆపడం చాలా కష్టం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. చదవండి: ఇది భరించలేని చెత్త వైరస్
Comments
Please login to add a commentAdd a comment