గువాహటి: అస్సాంలోని నాగోన్ జిల్లాలో శనివారం పట్టాలు దాటుతున్న 3 ఏనుగులను రైలు ఢీకొనడంతో అవి చనిపోయాయి. వీటిలో ఒకటి గర్భంతో ఉండటం, దానిలోని బిడ్డ కూడా మృతిచెందడం స్థానికులను తీవ్ర దిగ్రా్బంతికి గురిచేసింది. కాంపూర్‌లోని పోటియాపామ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు అక్కడికక్కడే చనిపోగా మరొకటి గాయాలతో తరువాత కన్ను మూసింది. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన రైల్వే శాఖపై కేసు నమోదుచేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ప్రమీలా రాణి అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో రైళ్ల వేగం గంటకు 15 కి.మీలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.