గిరిజన మహిళ ‘స్మార్ట్’ వ్యాపారం
తాను తయారుచేసిన పచ్చళ్లను వాట్సాప్‌లో పెట్టడం, ఆర్డరుతోపాటు పేమెంట్ కూడా ఆన్‌లైన్ ద్వారా తీసుకోవడం ద్వారా తన వ్యాపారాన్ని పెంచుకుంటోంది. ఇలా ఆర్డర్ తీసుకున్నారంటే సాయంత్రానికల్లా పంపించేస్తారు. పూర్ణిమ భర్త వ్యవసాయ కూలి. నలుగురు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ వ్యాపారం చేయడం విశేషం. ఇంతకీ పూర్ణిమకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. డిజిటల్ ఇండియా, నగదురహిత లావాదేవీల్లోభాగంగా రాష్ట్ర ప్రభుత్వం 10వేల సహాయక బృందాల్లోని సభ్యులకు స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. దీంతో ఆ ఫోన్‌ను వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన పూర్ణిమ.. ఇలా వాట్సాప్ ద్వారా పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు.