న్యూఢిల్లీ: భారత మాజీ హోం శాఖ మంత్రి, భారతరత్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ 128వ జయంతి వేడుకులు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలోని పంత్ విగ్రహానికి భారత ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో పంత్ కీలక పాత్ర పోషించారని ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ పేర్కొన్నారు. అలాగే కేంద్ర హోం మంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంత్ అందించిన దేశ సేవలను అన్సారీ ఈ సందర్భంగా కొనియాడారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీతోపాటు పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.