'రహదారులకు మహాశ్వేతాదేవి పేరు పెట్టండి' | Trinamool Congress urges govts to name road after litterateur Mahasweta Devi | Sakshi

'రహదారులకు మహాశ్వేతాదేవి పేరు పెట్టండి'

Aug 7 2016 2:18 PM | Updated on Sep 4 2017 8:17 AM

న్యూఢిల్లీ, కోల్‌కతాల్లోని రహదారులకు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పేరు పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇడ్రిస్ అలీ కోరారు.

కోల్‌కతా: న్యూఢిల్లీ, కోల్‌కతాల్లోని రహదారులకు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పేరు పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇడ్రిస్ అలీ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలిండియా మైనారిటీ ఫోరం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన మహాశ్వేతాదేవికి నివాళిగా ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు.

దేశం మొత్తానికీ ఆమె సుపరిచితురాలు కాబట్టి దేశ రాజధాని నగరంలో ఓ రహదారికి ఆమె పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన మహాశ్వేతాదేవి గత నెలలో మరణించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement