'రహదారులకు మహాశ్వేతాదేవి పేరు పెట్టండి'
కోల్కతా: న్యూఢిల్లీ, కోల్కతాల్లోని రహదారులకు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పేరు పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇడ్రిస్ అలీ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలిండియా మైనారిటీ ఫోరం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన మహాశ్వేతాదేవికి నివాళిగా ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు.
దేశం మొత్తానికీ ఆమె సుపరిచితురాలు కాబట్టి దేశ రాజధాని నగరంలో ఓ రహదారికి ఆమె పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన మహాశ్వేతాదేవి గత నెలలో మరణించిన విషయం తెలిసిందే.