Idris Ali
-
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇద్రిస్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను గమనిస్తే మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారి మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని ఇద్రిస్ అలీ జోస్యం చెప్పారు. #WATCH | West Bengal: Whatever happened with the President of Sri Lanka, will happen with PM Modi here. Looking at the things in India, PM Modi is a total failure...it will be even worse here. PM Modi will also resign and flee: TMC MLA Idris Ali in Kolkata pic.twitter.com/ailsU5jfgm — ANI (@ANI) July 10, 2022 కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ కూడా శనివారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితులు భారత్లో కూడా కన్పిస్తున్నాయని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారని వార్తలు వచ్చాక ఉదిత్ రాజ్ ఈమేరకు మాట్లాడారు. రాహుల్ గాంధీ సైతం మే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శ్రీలంకతో భారత్ను పోల్చిన ఆయన.. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోందని ధ్వజమెత్తారు. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయే కారణమంటూ ఆందోళనకారులు శనివారం ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఎవరికంటా పడకుండా పారిపోయారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారు పదవుల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
'రహదారులకు మహాశ్వేతాదేవి పేరు పెట్టండి'
కోల్కతా: న్యూఢిల్లీ, కోల్కతాల్లోని రహదారులకు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పేరు పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇడ్రిస్ అలీ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలిండియా మైనారిటీ ఫోరం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన మహాశ్వేతాదేవికి నివాళిగా ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. దేశం మొత్తానికీ ఆమె సుపరిచితురాలు కాబట్టి దేశ రాజధాని నగరంలో ఓ రహదారికి ఆమె పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన మహాశ్వేతాదేవి గత నెలలో మరణించిన విషయం తెలిసిందే. -
మోదీపై ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
-
మోదీపై ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇద్రిస్ అలీ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వివాదాస్పద విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. మోదీ లాహార్ పర్యటనకు వెళ్లివచ్చిన కొన్ని రోజులకే పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది? ఉగ్రవాదులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయేమోనని భావిస్తున్నాని అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అలీ చెప్పారు. అలీ.. సీపీఎం నాయకుడు గౌతమ్ దేవ్పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శారద చిట్ఫండ్ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడితే గౌతమ్ కాళ్లు నరికేస్తానని, ఆయన్ని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. కాగా అలీ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ఆయన వ్యాఖ్యలు పరిధి దాటాయని, అనుచితమని పేర్కొంది. అలీ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు వెల్లడించింది.