
రూ. 50 లక్షల విలువైన మద్యంతో పరార్!
ముజఫర్‌నగర్: డిస్టిల్లరీ నుంచి డిస్పాచ్ చేసిన రూ. 50 లక్షల విలువైన మద్యంతో ట్రక్కు డ్రైవర్ కనిపించకుండా పోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మన్సుపూర్‌లోని షాషాదిలాల్ డిస్టిల్లరీ నుంచి రూ 50 లక్షల విలువైన మద్యంతో ఓ ట్రక్కు డిసెంబర్ 15న ఆగ్రాకు బయలుదేరింది. అయితే ఆ ట్రక్కు ఆగ్రాలోని నిర్దేశించిన ప్రాంతానికి చేరకుండా మధ్యలోనే అదృశ్యమైంది. ట్రక్కు డ్రైవర్ హరి ఓం కూడా ఆనాటి నుంచి కనిపించకుండా పోయాడు. డిస్టిల్లరీ మేనేజర్ భరత్ సింగ్ ఫిర్యాదు మేరకు.. మద్యంతో హరి ఓం పరారయ్యాడా లేక.. దీని వెనుకాల ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.