
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. స్మైలీ ఫేస్ ఎమోజీతో ‘మఫ్లర్‌మాన్’ పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్ చేసింది. ఆప్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా వున్న ఒక పసిబిడ్డ ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానుల లైక్‌లతో పాటు కమెంట్లు, అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆప్ షేర్ చేసిన మినీ మఫ్లర్ మాన్ ఫోటో వైరల్ అవుతోంది.
ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరో యూజర్ ఆప్‌కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్, పాకిస్తాన్ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్ చేయడం విశేషం.
Mufflerman 😄 pic.twitter.com/OX6e8o3zay
— AAP (@AamAadmiParty) February 11, 2020
He will be the CM one day. 😍#DelhiResults
— Pramod Gupta (@PramodG96346806) February 11, 2020
Mophlar Men pic.twitter.com/oFrpjKgQY4