బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్ | Two Afghan men arrested for raping teen girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్

Oct 28 2016 8:24 PM | Updated on Apr 8 2019 6:20 PM

బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్ - Sakshi

బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్

మణిపూర్ రాష్ట్రానికి చెందిన పదహారేళ్ల బాలికపై ఇద్దరు విదేశీయులు అత్యాచారానికి పాల్పడ్డారు.

కృష్ణరాజపుర(కర్ణాటక): మణిపూర్ రాష్ట్రానికి చెందిన పదహారేళ్ల బాలికపై ఇద్దరు విదేశీయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం బెంగళూరులోని కృష్ణరాజపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యార్జనలో భాగంగా అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా అహ్మద్ బెంగళూరు వచ్చారు. ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. 
 
కృష్ణరాజపురలో నివాసం ఉంటున్న మణిపూర్‌కు చెందిన బాలిక ఈ నెల 26న టీసీపాళ్యలో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి తిరిగి తన గదికి నడుచుకుంటూ వెళుతుండగా కారులో అటుగా వచ్చిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా గమనించారు. ఆ అమ్మాయిని డ్రాప్ చేస్తామంటూ వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం కష్ణరాజపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement