సాక్షి, ముంబై: వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా విధుల్లో ఉన్న 19 మంది కానిస్టేబుల్స్ మృతి చెందగా.. తాజాగా కరోనా క్షణాలతో ముంబైలో మరో ఇద్దరు ఏఎస్‌ఐలు మరణించారు. ధారావిలోని షాహూనగర్ పోలీస్టేషన్‌లో ఏపీఐగా విధులు నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతూ.. మరణించారు.
మరో ఏఎస్‌ఐ కూడా శనివారం తెల్లవారుజామున బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిఉండటంతో సియోన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. టెస్టుల కోసం శాంపిల్స్‌ను పంపగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముంబై పోలీసుల ఎంటీ విభాగం అదనపు కమిషనర్ అతుల్ పాటిల్ ఏఎస్సై మరణాన్ని ధృవీకరించారు. మరణించిన ఏఎస్సైని 15 రోజుల కిందటే సెలవుపై పంపించామని చెప్పారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన పోలీసుల సంఖ్య 21కు చేరుకుందని అధికారులు తెలిపారు. చదవండి: కరోనా: ప్రకాశం జిల్లా అరుదైన రికార్డ్
మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,140 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడగా.. వీరిలో 949 మంది కానిస్టేబుల్ హోదాకు చెందినవారేనని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6,564 మంది కోలుకోగా.. 1,068 మంది మరణించారు. 21,467 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే. చదవండి: మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..!
Comments
Please login to add a commentAdd a comment