
రాయ్‌పూర్/నాగపూర్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో శనివారం నక్సలైట్ల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. తిప్పాపురం గ్రామానికి మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు పోలీసులపై నక్సల్స్ కాల్పులు జరిపినట్లు డీఐజీ సుందరరాజ్ తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించినట్లు పోలీసు అధికారి చెప్పారు. వీరిలో ఒకరిని రామ్‌కో అలియాస్ కమ్లా మంకు నరోటె (46)గా గుర్తించినట్లు తెలిపారు. ఈమె తలపై 16 లక్షల రివార్డు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment