సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. శివసేన అధికార దినపత్రిక ‘సామ్నా’లో మంగళవారం ‘స్మృతిస్థలంలో ఒక్కటైన ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌లు... ఇక వస్తాయి మంచి రోజులు...’ అనే శీర్షికతో ప్రధానవార్త ప్రచురితమైంది.
దీంతో ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఒక్కటి కావాలని ఎమ్మెన్నెస్‌తోపాటు శివసేన నాయకులు కూడా కోరుకుంటున్నారని స్పష్టమైంది. ముఖ్యంగా వీరిద్దరు ఒక్కటికావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు వార్తలో పేర్కొన్నారు. అదే విధంగా చాలారోజుల తర్వాత సామ్నా పత్రికలో రాజ్ ఠాక్రే ఫొటోతోపాటు వార్త ప్రచురితంకాగా అదికూడా ఉద్ధవ్ ఠాక్రేతో కలిసిఉన్న ఫొటో కావడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఠాక్రే సోదరులిద్దరూ ఒక్కటవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజ్, ఉద్ధవ్ చెట్టాపట్టాల్..
Published Tue, Nov 18 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement